10న జరిగే సభను విజయవంతం చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం ముందు ప్రభుత్వ ఉద్యోగుల ధర్నా.
చలో హైదరాబాద్ ఆందోళన కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులు అందరూ విజయవంతం చేయాలని టి జి ఈ జేఏసీ కన్వీనర్ గండూరి వెంకట్, టి జి ఓ సెక్రటరీ నిరంజన్ రెడ్డి,భీమ్ సింగ్ కోశాధికారి కోశాధికారి హైదరాబాద్ సిటీ నాయకులు కోరారు.
ఈ సందర్భంగా ఉద్యోగులను సమాయత్తం చేసి జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు గురువారం ఆందోళన కార్యక్రమంలో భాగంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో ఉద్యోగులు అందరూ ధర్నా చేపట్టారు.
ప్రధానంగా ఉద్యోగుల హక్కుల సాధన కోసం మెరుగైన ఫిట్మెంట్ రెండో పి ఆర్ సి ఆర్ డి ఏ లు పెన్షన్ బకాయిలు చెల్లించాలని డిమాండ్లతో ఉద్యోగులు ఈ ఆందోళనకు శ్రీకారం చుట్టారు.
ఈ ఆందోళనలో…ఎక్సైజ్ ఫోరం అధ్యక్షుడు ఎం జ్ఞానేశ్వర్, ఎక్సైజ్ హెచ్ ఓ డి అధ్యక్షుడు టీ.తిరుపతి నాయక్, నగర శాఖ కార్యదర్శి విజయ్ కుమార్, ఎం రాజేంద్ర స్వామి, శ్రీకాంత్ గౌడ్, కె విజయ, సరిత, మహేందర్ రావు పటేల్ మీడియా ఇంచార్జ్ టి జి జేఏసీ హైదరాబాద్ సిటీ ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.
