Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

టీపీసీసీ సోషల్ మీడియా ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ నవీన్ పెట్టెం:

టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు ఏఐసీసీ కార్యదర్శి శ్రీ సచిన్ సావంత్ గారి సమక్షంలో.. టీపీసీసీ సోషల్ మీడియా నూతన ఛైర్మన్ శ్రీ నవీన్ పెట్టెం గారు, నేడు అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

​ఛైర్మన్‌తో పాటు నూతనంగా నియమితులైన సోషల్ మీడియా కన్వీనర్లు, కోఆర్డినేటర్లు కూడా తమ తమ బాధ్యతలను స్వీకరించారు.

​ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ, టీపీసీసీ మీడియా ఛైర్మన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి గారు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు మరియు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ నవీన్ పెట్టెం గారు మాట్లాడుతూ.. “ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం, క్షేత్రస్థాయి మరియు గ్రామస్థాయి సమస్యలను పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం, అలాగే 2029లో కాంగ్రెస్ పార్టీని 100 స్థానాలలో గెలిపించి, మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు శ్రమించడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *