హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టిపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు వి హనుమంత రావు, ఎంపీ లు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, విప్ బీర్ల ఐలయ్య, బల్మూర్ వెంకట్, ఎంఎల్ ఏ లు నవీన్ యాదవ్, శ్రీ గణేష్, ప్రకాష్ గౌడ్, మందుల సామెల్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ, బీసీ సంఘాల నాయకులు.
టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగం
గతంలో చెప్పినట్లు రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్. బహుజనుల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారు. నానుడిని ఉద్దేశించి.
పుడితే రాజై పుట్టాలి లేదా గౌడై పుట్టాలి. రేవంత్ గౌడ్ గా బహుజనులకు అండగా ఉండాలి. గౌడ్ లు తలుచుకుంటే మరో ఐదు సార్లు ప్రభుత్వం ఏర్పడుతుంది. సర్దార్ సర్వాయి పాపన్న నిరుపేద కుటుంబంలో పుట్టి గోల్కొండ కోటను జయించాడు. మహనీయుల విగ్రహాలు రేవంత్ గౌడ్ కృషి వల్ల వచ్చాయి. గతంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం, స్థలం, సీఎం రేవంత్ చూపించారు. నేడు అక్కడే విగ్రహం ఆవిష్కరించుకున్నాం.
సరదాగా కల్లు రుచి చూడాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి. కల్లు గీత కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్లు గీత కార్మికులను ప్రోత్సహించాలని సీఎం రేవంత్ కి విజ్ఞప్తి.
