నీట్ పరీక్షను రద్దు చేసి రీ-ఎగ్జామ్ పెట్టినప్పుడు విద్యార్థులు ఎంతటి మనోవేదనకు గురి అయ్యారో, ప్రధాని నరేంద్ర మోడీ కి తెలియాలంటే రీ ఎగ్జాములకు బదులు తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని రీ ఎలక్షన్ పెట్టుకుంటే తెలుస్తుందని ఘాటు వ్యాఖ్యలు విద్యార్థులతో పెట్టుకుంటే మోడీ పార్టీ బీజేపీ భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలవని పరిస్థితి వస్తుందని గిద్దె రాజేష్ సంచలన వ్యాఖ్య
కోదాడ జూలై 24.
మే 3న నీటి పరీక్ష నిర్వహించి మే 12న రద్దు చేసి తిరిగి జూన్ 21న రీ ఎగ్జామ్ నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం, మాట మాటకు రీ ఎక్షమ్ నిర్వహించడం కాదు ఒక్కసారి మీరు రీ ఎలక్షన్స్ నిర్వహించుకొని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్, దేశ ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు ఆయన కోదాడలో మీడియాతో మాట్లాడుతూ, నీట్ పరీక్ష పత్రాల లీకేజీ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాటీలు తూటాలో దుళిపించడం కాదు, విద్యార్థులకు మళ్లీమళ్లీ పరీక్షల నిర్వహించినట్లే, ఒక్కసారి మీ ప్రభుత్వానికి రీ ఎలక్షన్ నిర్వహించుకుంటారా, లేక కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేస్తారా, లేక ఆయనతో రాజీనామా చేయిస్తారో నిర్ణయించుకోవాలని డిమాండ్ చేశారు. యువకులు విద్యార్థుల ఓట్లతో మూడుసార్లు గద్దెనెక్కి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటూ నరేంద్ర మోడీ ప్రభుత్వం, పబ్బం గడుపుకుంటుందని ఇప్పటికైనా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయిస్తారా? లేక మీరే భర్తరఫ్ చేస్తారా తేల్చుకోవాలని విద్యార్థి లోకం తలుచుకుంటే ప్రధాని మోడీ బిజెపి పార్టీకి దేశంలో ఏ రాష్ట్రంలో ఒక్క పార్లమెంటు సీటు రాకుండా చేస్తుందని అన్నారు
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్
