గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎనర్జీ) శ్రీ నవీన్ మిత్తల్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, విశ్వసనీయమైన, సురక్షితమైన విద్యుత్ సరఫరాతో పాటు ఉత్తమ సేవలను అందించాలనే లక్ష్యంతో బజార్‌ఘాట్ ప్రాంతంలో ప్రజా బాట – బస్తీ బాట వాక్ అలాంగ్ ది లైన్ కార్యక్రమం నిర్వహించారు.
TGSPDCL CMD శ్రీ జితేష్ వి. పాటిల్ గారి ఆదేశాల మేరకు డైరెక్టర్ (కమర్షియల్) శ్రీ చ. చక్రపాణి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు CE/మెట్రో జోన్ శ్రీ కరుణాకర్ బాబు పులిపాటి, SE/హైదరాబాద్ సెంట్రల్ శ్రీ రమేష్ సాముద్రాల, DE/మెహదీపట్నం శ్రీ సుధీర్ థోరట్, ADE/OP/ఏసీ గార్డ్స్ శ్రీ విజయ్ కుమార్ కొల్చెల్మా మరియు AE/OP/ఏసీ గార్డ్స్ శ్రీ నజీర్ సయ్యద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు బజార్‌ఘాట్ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యుత్ మౌలిక వసతులను పరిశీలించారు. అవసరమైన చోట లోపభూయిష్టమైన చిన్నపాటి విద్యుత్ పరికరాలను గుర్తించి మార్పులు చేశారు.
అధికారులు స్థానిక విద్యుత్ వినియోగదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకోవడంతో పాటు విద్యుత్ సేవల మెరుగుదలకు సంబంధించి వారి సలహాలు, సూచనలు మరియు అభిప్రాయాలను స్వీకరించారు. ఈ సందర్భంగా వినియోగదారులు విద్యుత్ శాఖ అందిస్తున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, విద్యుత్ సరఫరా మరియు సేవలపై సానుకూలంగా స్పందించారు.
విద్యుత్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ట్రాన్స్ఫార్మర్ల వద్ద చెత్త, ఇంటి వ్యర్థాలు లేదా నిర్మాణ వ్యర్థాలను వేయరాదని అధికారులు సూచించారు. ట్రాన్స్ఫార్మర్ మరియు దాని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా, సురక్షితంగా మరియు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉంచాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్కు పక్కనే ఉన్న కొబ్బరి బొండాల బండిని తొలగించాలని కూడా సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత క్షేత్రస్థాయి అధికారులకు వినియోగదారుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు, కొత్త కనెక్షన్లు, అదనపు లోడ్లు మరియు ఇతర అర్హత కలిగిన సేవలను నిర్ణీత SOP కాలపరిమితిలో విడుదల చేయాలని ఆదేశించారు.
అలాగే, అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం యూజర్ ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలని, వినియోగదారుల నుంచి ఎటువంటి అదనపు లేదా అనధికారిక మొత్తాన్ని వసూలు చేయరాదని స్పష్టం చేశారు.
విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు 1912, FOC నంబర్ 87124700024, చాట్‌బాట్ నంబర్ 8712441912 లేదా సంబంధిత AE నంబర్ 8712469985ను సంప్రదించవచ్చని తెలిపారు.
వినియోగదారులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన మరియు విశ్వసనీయమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా అధికారులు వినియోగదారుల అవసరాలను నేరుగా తెలుసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో విద్యుత్ సేవల పరిస్థితిని పరిశీలించారు. వినియోగదారుల సానుకూల స్పందనతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో విద్యుత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. లైన్ పనులు చేపట్టే సమయంలో అన్ని భద్రతా జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు. లైన్‌పై పని ప్రారంభించే ముందు రెండు వైపులా ఎర్తింగ్ చేయడం, అవసరమైన చోట ఎల్.టి. ఫ్యూజ్లను తొలగించడం, ఇన్వర్టర్లు మరియు రూఫ్‌టాప్ సోలార్ నుంచి బ్యాక్ సప్లై వల్ల ఏర్పడే ఇండక్షన్‌ను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఏ.బి. స్విచ్‌ను తెరిచే సమయంలో మూడు బ్లేడ్లు కూడా పూర్తిగా ఓపెన్‌లో ఉన్నాయని నిర్ధారించుకోవాలని స్పష్టం చేశారు. అలాగే వదులుగా ఉన్న విద్యుత్ లైన్లు, వంగిన విద్యుత్ స్తంభాలను వెంటనే సరిచేయాలని, లైన్ క్లియర్ (LC) తీసుకునే ముందు నిర్దేశిత అన్ని భద్రతా జాగ్రత్తలను పాటించాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో వినియోగదారులకు ముందస్తు సమాచారం అందించి, సురక్షితమైన మరియు అంతరాయం లేని విద్యుత్ సేవలకు అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని తెలిపారు.
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన, విశ్వసనీయమైన విద్యుత్ సరఫరా, పారదర్శకమైన సేవలు మరియు నిర్ణీత కాలపరిమితిలో వినియోగదారుల సమస్యల పరిష్కారం అందించడంలో TGSPDCL తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.
