Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
ఆంధ్రప్రదేశ్

నేడు హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని గడ్డి అన్నారం డివిజన్ లో TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ గండి జగన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి.నవీన్ యాదవ్  హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికి శాలువా తో సత్కారం చేశారు.. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.. అనంతరం భక్తులు, నిర్వాహకులతో కలిసి జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు.

శ్రీకృష్ణుడి బోధనలు సమాజానికి మార్గదర్శకమని, ధర్మం, సత్యం, న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, యాదవ సంఘం నాయకులు,పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *