Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

ఇంద్రకరణ్ గ్రామం లో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి

కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి హాజరై నూతన గృహాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతోందని అన్నారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.పేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్లు నిలుస్తున్నయన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు,మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచందర్ నాయక్,కంది మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ మొగులయ్య, మోతిలాల్ నాయక్ సర్పంచ్ శంకరి రాజు,  ఉప సర్పంచ్ కొన్యాల లావణ్య రాజేందర్ రెడ్డి మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *