Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి విముక్తి – ఫిర్యాదుదారుడి కేసు కొట్టివేత

కొత్తగూడెం(లీగల్): 01-09-2026:

కొత్తగూడెం III Judicial First Class Magistrate Court‌లో విచారణకు వచ్చిన C.C. No. 276/2018 చెక్ బౌన్స్ కేసులో నిందితుడు క్రుపాడే కిషోర్‌కు గౌరవ న్యాయస్థానం ఈ రోజు 01-09-2026న నిర్దోషిగా (Acquitted) తీర్పు ఇచ్చింది.

ఈ కేసును మండలేపు వెంకటేశ్వరరావు ఫిర్యాదుదారుడిగా దాఖలు చేశారు. నిందితుడు రూ. 4,50,000/- అప్పుగా తీసుకొని ప్రామిసరీ నోట్ ఇచ్చారని, అనంతరం చెక్ జారీ చేశారని, ఆ చెక్ dishonour కావడంతో Negotiable Instruments Act, 1881లోని Section 138 read with Section 142. కింద ఫిర్యాదు దాఖలు కోర్టు లో కేసు దాఖలు చేశాడు.

విచారణ సందర్భంగా ఫిర్యాదుదారుడి తరఫున ఒక సాక్షిని పరిశీలించగా, నిందితుడి తరఫున నిందితుడు మరియు మరో సాక్షిని కోర్టులో పరిశీలించారు. ఇరుపక్షాల సాక్ష్యాలు, పత్రాలు మరియు వాదనలను గౌరవ న్యాయస్థానం పరిశీలించింది.

నిందితుడి తరఫున సినియర్ న్యాయవాది అడ్వకేట్లు గాజుల రామ్మూర్తి, ఎన్. రాంబాబు హాజరై సమర్థవంతంగా వాదనలు వినిపించారు. నిందితుడిపై మోపబడిన ఆరోపణలు చట్టపరంగా నిరూపించబడలేదని, ఫిర్యాదుదారు తన కేసును అవసరమైన ప్రమాణాలతో నిరూపించడంలో విఫలమయ్యారని నిందితుడి తరఫు న్యాయవాదులు వాదించారు.

వాదనలు మరియు రికార్డులను పరిశీలించిన అనంతరం గౌరవ III Judicial First Class Magistrate, Kothagudem న్యాయస్థానం నిందితుడిని Acquit (నిర్దోషిగా విడుదల) చేస్తూ ఈ రోజు తీర్పు వెలువరించింది.

ఈ తీర్పుతో నిందితుడు క్రుపాడే కిషోర్‌కు చట్టపరమైన విజయం లభించిందని నిందితుడి తరఫు న్యాయవాదులు గాజుల రామమూర్తి, యన్.రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *