జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ వి. నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్మించిన ఈ దేవాలయ ముఖద్వారం (కమాన్)ను హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడంతో పాటు, దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
