Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా

టీజీఈజేఏసీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఇందిరా పార్క్ వద్ద జరిగిన భారీ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ మారం జగదీశ్వర్, చైర్మన్, శ్రీ ఎలూరి శ్రీనివాస్ రావు, జనరల్ సెక్రటరీ, డా. ఎస్.ఎం. హుస్సైనీ (ముజీబ్), టీఎన్జీవోస్ జనరల్ సెక్రటరీ బి శ్యామ్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో  శ్రీ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ, తమ ఉద్యోగులు మరియు పెన్షనర్ల దీర్ఘకాలిక న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఇప్పటికే ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, కానీ ప్రభుత్వం తాత్సారం చేస్తుందని అన్నారు. తమ ప్రధాన డిమాండ్ల గురించి ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఎన్నోసార్లు మెమోరండం సమర్పించామని తెలిపారు.

తెలంగాణ ఉద్యోగులు అందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నామని అన్నారు.

మన ప్రధాన డిమాండ్లు:
1. కొత్త పీఆర్సీ అమలు
2. పెండింగ్‌లో ఉన్న 6 డీఏల విడుదల
3. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ
4. ఉద్యోగ ఆరోగ్య కార్డుల పూర్తి స్థాయి అమలు
5. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్
6. జీవో నెం. 25 సవరణ, జీవో నెం. 190 అమలు
తక్షణమే చర్యలు తీసుకొని పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లు దాదాపు పది వేల మంది హాజరయ్యారు.

ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై టీజీఈ జేఏసీ హైదరా బాద్ సిటీ చైర్మన్ శ్రీ కట్కూరి శ్రీకాంత్, హైదరాబాద్ జిల్లా చైర్మన్,

శ్రీ విక్రమ్, రంగారెడ్డి జిల్లా చైర్మన్ శ్రీ వూటు యశ్వంత్ నాయకత్వం వహించారు.
హైదరాబాద్ సిటీ కన్వీనర్ శ్రీ గండూరి వెంకటేష్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ శ్రీ కృష్ణ యాదవ్, రంగారెడ్డి జిల్లా కన్వీనర్ శ్రీ రామారావ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.

ఈ సందర్భంగా టీజీఈజేఏసీ నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగులు ఎంతోకా లంగా ఎదురు చూస్తు న్న 2వ పీఆర్సీని  ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను కూడా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సంఘాల నాయకుల కస్తూరి వెంకటేశ్వర్లు. సత్యనారాయణ గౌడ్ సహదేవ్ డాక్టర్ హరికృష్ణ శ్రీరామ్ రెడ్డి వెంకటరమణ ఏమే ఖాదర్ మంజులా రెడ్డి శైలజ ఉమా రెడ్డి వరలక్ష్మి స్వరూప లక్ష్మి. అపరంజిత. అమరేందర్. నరసింహస్వామి. రాజు అవినాష్ విజయ్ మహేష్ గౌడ్. రాజ్ కుమార్ కుతాడి శ్రీనివాస్. డి నరేందర్. కొండల్ రెడ్డి. బాల్రాజ్ రాజు. ఆశన్న మల్లికార్జున్ రెడ్డి. పూనం పేరయ్య గౌస్ డాక్టర్ జోషి. సత్యనారాయణ దేవేంద రవికుమార్. ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *