బీజేపీ దేశ ప్రధాని మోదీ అనధికారికంగా పాకిస్తాన్ పోతే దీనిపై బీజేపీ ఎంపీ లు ఎందుకు మాట్లాడ లేదు?
స్వేచ్ఛ అనే పదం పదేళ్ల BRS పాలన లో బందీ అయ్యింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్వేచ్ఛ ఇచ్చింది. ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ, ధర్నా చేసుకునే స్వేచ్ఛ కూడా అందించింది కాంగ్రెస్ పాలన. ఇందిరాపార్క్ లో ఏదైనా తమ డిమాండ్ ల పై ధర్నా చేసుకునే స్వేచ్ఛ ఇచ్చింది. పధకాల అమలులో ఉచిత బస్సు, 90 శాతం రుణమాఫీ అయ్యింది. సన్నబియ్యం ఇస్తున్నాం. రేషన్ కార్డుల్లో స్మార్ట్ కార్డు ఇచ్చాం. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన పెట్టుకుని బయలు దేరారు. బీజేపీ ప్రభుత్యం అడ్డుకుంది. లండన్ నుండే వెనక్కి రప్పించింది కేంద్రం. సీఎం హోదాలో ఏదో కారణం చూపి ఆపేశారు. తెలంగాణ సీఎం కాంగ్రెస్ పార్టీ అని కేంద్ర బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంది.
తెలంగాణ సీఎం టూర్ సక్సెస్ కాకుండా అడ్డుకున్నారు.
తెలంగాణ ప్రజలు, విద్యార్దులు, మేధావులు ఆలోచించాలి. బీజేపీ ప్రభుత్యం తెలంగాణ సీఎం ను అవమానించింది అంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్టే. అమెరికాకు పోవడం రేవంత్ రెడ్డి కి కొత్త ఏం కాదు కదా? ఎందుకు ఆపాల్సి వచ్చింది. అంత అవసరం ఏముంది? ఈటెల రాజేందర్ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిని కలవడానికి పోతున్నారు అని ఆరోపించారు.
ప్రధాని మోడీ ఎవరికి చెప్పకుండా పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళాడు. ఎందుకు! నవాజ్ షరీఫ్ బర్త్ డే ఉందని పాకిస్థాన్ పోయాడు.
బెడ్ రూమ్ నుండి ఆఫీస్ పోయినా, ప్రధాని సెక్యూరిటీ చెక్ చేస్తుంది. అలాంటి ప్రోటోకాల్ లో ఉన్న మోడీ… పాకిస్థాన్ ఎలా వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? మోడీ ఎలాంటి సమాచారం లేకుండా పాకిస్థాన్ ఎలా వెళ్ళాడో సమాధానం చెప్పి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడండి.
బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి ని తప్పు పట్టడం కాదు, అనధికారికంగా మోడీ పాకిస్తాన్ వెళ్ళాడు. ఎందుకు! చెప్పండి. అధికారికంగా అమెరికాకు వెళ్తా అంటే అడ్డుకుని కుట్ర చేశారు.
మన శత్రు దేశానికి ఎందుకు వెళ్ళాడు మోదీ? శత్రు దేశం లోకి మోదీ ఎందుకు వెళ్ళాడో చెప్పి..రేవంత్ రెడ్డి గురించి మాట్లాడండి. అమెరికా పర్యటన లో అంబాసిడర్ కి తెలుస్తుంది. వాళ్ళే వెంట ఉంటారు. లండన్ కి అనుమతి ఇచ్చి అమెరికా ఎందుకు ఆపారు అనేది మోడీ చెప్పాలి. బీజేపీ వాళ్ళు ఏం చేసినా సంసారమే. పదేళ్ల BRS పాలనలో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది
రాహుల్ గాంధీ నాయకత్వం లో పని చేయాలని తపనతో ఉన్నారు సీఎం రేవంత్. మోడీ ఎందుకు టెంప్ట్ అయ్యాడు. అలా మోదీ అడగడం సీఎం కి ఇబ్బందిగానే ఉంటుంది.
ప్రధాని టెంప్ట్ అయినా రేవంత్ రెడ్డి న్యూట్రల్ గా ఉన్నారు. బ్యాలెన్స్ గా ఉన్నారు. రాహుల్ గాంధీ పట్ల కమిట్మెంట్ తో ఉన్నాడు రేవంత్ రెడ్డి.
