హైదరాబాద్, ఆగస్టు 24, 2026
హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఆగస్టు 22, 23, 24 తేదీలలో టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పవర్ ఎగ్జిబిషన్–2026 ఘన విజయవంతమైంది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రదర్శనకు విద్యార్థులు, యువత, విద్యుత్ రంగ నిపుణులు, ప్రజలు విశేషంగా హాజరై విద్యుత్ రంగ అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాలపై అవగాహన పొందారు.
ఈ ఎగ్జిబిషన్ విజయవంతం కావడంలో టీజీఎస్పీడీసీఎల్కు చెందిన అధికారులు, ఇంజినీర్లు, ఉద్యోగులు, సిబ్బంది అహర్నిశలు శ్రమించారు. ప్రదర్శన ఏర్పాట్లు, సందర్శకుల మార్గదర్శనం, సాంకేతిక స్టాల్స్ నిర్వహణ, భద్రతా చర్యలు, సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయం తదితర అంశాల్లో ఉద్యోగులు సమిష్టిగా కృషి చేసి ఎగ్జిబిషన్‌ను విజయవంతం చేశారు.
మూడు రోజుల కార్యక్రమం ముగింపు సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వహణలో భాగస్వాములైన టీజీఎస్పీడీసీఎల్ అధికారులు, ఉద్యోగులు స్మారకంగా గ్రూప్ ఫోటో దిగారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అధికారులు అభినందనలు తెలియజేశారు.
