Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

ఫలించిన వరుణ యాగం. కరుణించిన వరుణుడు.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే చేసిన వరుణ యాగం.
మరుసటి రోజు నుంచే వర్షాల వరం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని  శ్రీనగర్ కాలనీ డివిజన్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జూలై 24న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలకు సుభిక్షం కలగాలని సంకల్పించి వైదిక పండితుల ఆధ్వర్యంలో ఘనంగా వరుణ యాగం నిర్వహించారు.

ఆ యాగం జరిగిన మరుసటి రోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా ప్రతిరోజూ వర్షాలు కురుస్తుండటం విశేషంగా మారింది. ప్రజలు కూడా దీనిని దైవానుగ్రహంగా నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ నగర వాసులకు నీటి కొరత లేకుండా, రాష్ట్ర ప్రజల సంక్షేమం, రైతుల శ్రేయస్సు, ప్రకృతి సమతుల్యత కోసం నిర్వహించిన ఈ వరుణ యాగం ఫలించి, సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడం పట్ల భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *