రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని తన ఆత్మీయ సోదరి, పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు… ఈరోజు బంజారాహిల్స్ లోని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ గారి నివాసానికి వచ్చి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా స్వీట్లు తినిపించి.. తమ మధ్య ఉన్న ఆత్మీయతను పంచుకున్నారు. ప్రతి ఏటా రాఖీ పౌర్ణమి రోజున సీతక్క గారు. మధుయాష్కీ గారికి రాఖీ కట్టి తమ మధ్య ఉన్న అన్నా చెల్లెలి అనుబంధాన్ని పంచుకుంటారు. కాగా, ఈ రోజు తమ నివాసానికి వచ్చిన సీతక్క గారికి మధుయాష్కి గారు సాధరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మధుయాష్కి గారి మాతృమూర్తి, అక్కలతోనూ సీతక్క గారు ఆత్మీయంగా మాట్లాడారు.
మధుయాష్కి గారికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క
