హైదరాబాద్, ఆగస్టు 21, 2026: మలబార్ గోల్డ్ & డైమండ్స్ హైదరాబాద్‌లోని సోమాజిగూడలో పునరుద్ధరించిన షోరూమ్‌ను శుక్రవారం ఆవిష్కరించింది. ‘సోమాజిగూడ గ్రాండర్ ద్యాన్ ఎవర్ – ఎ ల్యాండ్‌మార్క్ రీఇమాజిన్డ్’ కాన్సెప్ట్‌తో ఆధునీకరించిన ఈ షోరూమ్‌లో బంగారం, వజ్రాలు, ప్లాటినం, రత్నాలు, అన్‌కట్ మరియు వెండి ఆభరణాల విస్తృత కలెక్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రముఖ నటి శ్రీనిధి శెట్టి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మలబార్ గోల్డ్ & డైమండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ – ఇండియా ఆపరేషన్స్ అషేర్ ఓ, హెడ్ – రిటైల్ ఆపరేషన్స్ సిరాజ్ పి.కె షోరూమ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ ఛైర్మన్ ఎం. పి. అహమ్మద్ మాట్లాడుతూ, “హైదరాబాద్ మలబార్ గోల్డ్ & డైమండ్స్‌కు ఒక ముఖ్యమైన మార్కెట్. మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సంప్రదాయ, బ్రైడల్ ఆభరణాలతో పాటు లైట్‌వెయిట్, కాంటెంపరరీ డిజైన్లను అందించడంపై మేము దృష్టి సారిస్తున్నాం. పునరుద్ధరించిన సోమాజిగూడ షోరూమ్ మా కస్టమర్-ఫస్ట్ రిటైల్ అనుభవానికి ప్రతిబింబం,” అని అన్నారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రత్నాలు, అన్‌కట్ ఆభరణాలపై వాల్యూ యాడిషన్పై 25% వరకు తగ్గింపు సెప్టెంబర్ 14 వరకు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. షోరూమ్‌లో 100% HUID-హాల్మార్క్డ్ గోల్డ్, సర్టిఫైడ్ డైమండ్స్, జీవితకాల మెయింటెనెన్స్ సపోర్ట్, బైబ్యాక్ పాలసీ, ఫెయిర్-వాల్యూ ఎక్స్ఛేంజ్ వంటి కస్టమర్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి
