Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

రూ.100కోట్లతో సంగారెడ్డి నియోజకవర్గంలో 83 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు: జగ్గారెడ్డి, నిర్మల

83 కిలోమీటర్ల మేర అందుబాటులోకి రానున్నకొత్త రోడ్లు

29 కిలోమీటర్ల ఆర్​ అండ్​ బీ రోడ్లు
54 కిలోమీటర్లు పంచాయతీరాజ్​ రోడ్లు

త్వరలోనే పనులు ప్రారంభించేందుకు కసరత్తు
అధికారులతో సమీక్షించిన జగ్గారెడ్డి, నిర్మల

సంగారెడ్డి నియోజకవర్గంలో 83కిలోమీటర్ల పొడవున రోడ్లను నిర్మించేందుకు రూ.100 కోట్ల నిధులు మంజూరయ్యాయని జగ్గారెడ్డి, నిర్మల తెలిపారు.

ఈ పనులు త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు. ఈ అంశమై ఆర్​ అండ్​ బీ, పంచాయతీ రాజ్​ శాఖలకు చెందిన అధికారులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో కనీసం పాడైపోయిన రోడ్లను బాగు చేసేందుకు రెన్యువల్​ కూడా చేయించలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తమ హయాంలో వేసిన రోడ్లనే ఇప్పటికీ ప్రజలు ఉపయోగిస్తున్నారని, మరమ్మతులకు గురికావడంతో పదేళ్లుగా పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందుల పాలయ్యారన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రధాన మార్గాలను, గ్రామాలను, మండల కేంద్రాలను, పట్టణాలను కలిపేలా రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కొత్తగా కావాల్సిన కొన్ని రోడ్లు, గతంలో పూర్తి చేసి పెండింగులో ఉన్న బిల్లులకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. పెండింగ్​ బిల్లులను వెంటనే ఇప్పించేలా తాను సీఎం రేవంత్​ రెడ్డితో పాటు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కను కలిసి మాట్లాడతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

ఆర్​ అండ్​ బీ రోడ్లను బాగు చేయనున్నారిలా!

జాతీయ రహదారి 65 నుంచి వయా లక్డారం, బ్యాతోల్​ మీదుగా ఇస్మాయిల్​ ఖాన్​ పేట గ్రామం వరకు 6.20కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు వేయనున్నారు.

జాతీయరహదారి 65 నుంచి పరివార్​ దాబా వద్ద ప్రారంభమై ఇస్మాయిల్​ ఖాన్​ పేట వరకు 6.50 కిలోమీటర్ల మేర రోడ్డు వేయనున్నారు.

పెద్దాపూర్​ నుంచి అనంత్​ సాగర్​ వయా తొగర్​ పల్లి, అలియాబాద్​, కొండాపూర్​, మారేపల్లి వరకు 16.10కిలోమీటర్ల మేర రోడ్డును బాగు చేయనున్నారు.

పంచాయతీ రాజ్​ శాఖ నుంచి.
బాగు చేయనున్న రోడ్లు ఇలా!

జాతీయ రహదారి 65 నుంచి చిమ్నాపూర్ తండా వరకు 6.67కిలోమీటర్ల మేర రోడ్డు బాగు చేయనున్నారు.

సంగారెడ్డి పట్టణంలోని జేసీ బంగ్లా నుంచి మల్కాపూర్​ ఎక్స్​ రోడ్డు వరకు వయా రాజంపేట వరకు 3.73కిలోమీటర్ల మేర రోడ్డు వేయనున్నారు.

సంగారెడ్డి నుంచి తాళ్లపల్లి వరకు 1.64కిలోమీటర్ల మేర రోడ్డు బాగు చేయనున్నారు.

శంకర్​ పల్లి రోడ్డు నుంచి చేర్యాల వరకు 1.97కిలోమీటర్ల మేర రోడ్డు వేయనున్నారు.

కంది మండలం మామిడిపల్లి నుంచి తున్కిల తండా వయా గొల్లగూడెం తండా వరకు 1.73కిలోమీటర్ల మేర రోడ్డు వేయనున్నారు.

కంది మండలం ఎర్దనూరు నుంచి ఇస్మాయిల్​ ఖాన్​ పేట వరకు 1.58కిలోమీటర్ల మేర రోడ్డు వేయనున్నారు.

శంకర్​ పల్లి రోడ్డు నుంచి కంది మండలంలోని కలివేముల, చెర్లగూడెం వరకు 2.76కిలోమీటర్ల మేర రోడ్డు వేయనున్నారు.

సదాశివపేట మండలంలోని జాతీయ రహదారి 65 నుంచి మెలిగిరిపేట వరకు వయా ఆరూరు మీదుగా 2.95కిలోమీటర్ల మేర రోడ్డు వేయనున్నారు.

సదాశివపేట మండలం సదాశివపేట నుంచి మాచిరెడ్డిపల్లి వరకు వయా వెంకటపూర్​ వరకు 5.72కిలోమీటర్ల మేర రోడ్డు వేయనున్నారు.

అనంత్​ సాగర్​ నుంచి సదాశివపేట పట్టణం, వయా రేజింతల్​ మీదుగా 3.63కిలోమీటర్ల మేర రోడ్డు వేయనున్నారు.

సదాశివపేట మండలంలోని మోమిన్​ పేట రోడ్డు నుంచి అనంత్​ సాగర్​ వరకు 4.52కిలోమీటర్ల మేర రోడ్డు వేయనున్నారు.

కొండాపూర్​ మండల కేంద్రం నుంచి ఎదురుగూడెం వరకు 2.35కిలోమీటర్ల మేర రోడ్డు వేయనున్నారు.

కొండాపూర్​ మండలం గొల్లపల్లి నుంచి పరమేశ్వర గుట్ట వరకు 2.87 కిలోమీటర్ల మేర రోడ్డు వేయనున్నారు.

కొండాపూర్​ మండల కేంద్రం నుంచి నాగ్​ సాన్​ పల్లి వరకు 1.15కిలోమీటర్ల మేర రోడ్డు వేయనున్నారు.

​కొండాపూర్​ మండలం మారేపల్లి నుంచి సీహెచ్​ కోనాపూర్​ వరకు 10.5కిలోమీటర్ల మేర రోడ్డు వేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *