696.1 కేజీల ఆదేశాల మేరకు దహనo
ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లాలోని నాలుగు ఎక్సైజ్ సేష్టన్లలో పట్టుబడిన రూ. 3.50 కోట్ల విలువ చేసే 696.1 కేజీల గంజాయిని ఖమ్మం డిప్యూటి కమిషనర్ సోమిరెడ్డి అదేశాల మేరకు గురువారం కాల్చివేశారు.
కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్లో 316.07 పేజీల గంజాయిని, భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్లోని 329.51 కేజీల గంజాయిని, పాల్వంచ ఎక్సైజ్స్టేషన్లో 43.62 కేజీల గంజాయిని, మణూగూర్ ఎక్సైజ్ స్టేషన్ లోని 6.9 కేజీల గంజాయిని ప్రభుత్వ అమోదం పొందిన ఏ డబ్ల్యూఎస్ కన్సెటెనింగ్ గొపాల్పేట్ తల్లెడ మండలంలోని గంజాయి కాల్చివేత పరిశ్రమలో కల్చివేశారు.
నాలుగు ఎక్సైజ్ స్టేషన్ల్లోని 32 కేసుల్లో పట్టుబడిన గంజాయిని దహనం చేయాలని ఖమ్మం డిప్యూటి కమిషనర్ సోమిరెడ్డి ఇచ్చిన అదేశాల మేరకు ఈఎస్ శ్రీనివాసరెడ్డి సీఐలు ఇతర సిబ్బంది కలిసి గంజాయిని కాల్చివేశారు.
