రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, దేవాదాయ, అటవీ & పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారి సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయాల్లో శ్రీ వరుణ యాగాలు నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా నేడు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ వరుణ యాగంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్టంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సంతోషంగా ఉండాలని, రాష్ట్రం సస్యశ్యామలంగా వెలుగొందాలని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి భగవంతుడిని ఆయన ప్రార్థించారు.

అనంతరం ప్రకృతి సమతుల్యత నెలకొని సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతుల పంటలు సమృద్ధిగా పండాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో జీవించాలని శ్రీ వరుణ దేవునికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ హనుమంతరావు గారు, దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీ అర్జున్ యాదవ్ గారు, కమిటీ సభ్యులు దినేష్, రాజేష్, జగదీష్, సుదర్శన్ రెడ్డి గార్లు తదితరులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
