హైదరాబాద్: ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా ఏ.జీ కాలనీ డివిజన్ పరిధిలోని యాదగిరి నగర్, జై భవాని నగర్లో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మంత్రివర్యులకు శాలువాతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బీసీ జేఏసీ నాయకులు చిన్న శ్రీశైలం యాదవ్ గారు మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా కలిసి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
