TGEJAC Hyderabad District ఎస్ విక్రమ్ కుమార్ మరియు ఎం బి కృష్ణ యాదవ్ నేతృత్వం లో కార్యవర్గ సమావేశం ఈరోజు Hyderabad District Collectorలో పలు కీలక అంశాలను చర్చించి, క్రింది కార్యక్రమాలు ఏకగ్రీవంగా నిర్ణయించింది:
TGEJAC తీసుకున్న నిర్ణయాలు, PRC ని వెంటనే ప్రకటించాలి, DA లను వెంటనే ప్రకటించి పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలి, OPS ను పునరుద్దరించాలి, EHS ను సమర్థవంతం గా అమలు చేయాలని కోరుతూ తీసుకున్న నిర్ణయాలకు మద్దతు ప్రకటించి ఈ క్రింది కార్యక్రమాలను విజయవంతం చేయాలనీ కోరారు.
🔹 27 ఆగస్టు 2026: ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా/ప్రదర్శన.
🔹 10 సెప్టెంబర్ 2026: చలో హైదరాబాద్ కార్యక్రమం.
ఈ కార్యక్రమాలకు Hyderabad జిల్లా నుండి ప్రతి ఒక్కరూ సంపూర్ణ సహకారం అందిస్తూ, అధిక సంఖ్యలో పాల్గొనాలని సభ్యులను కోరారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ విభాగం) శ్రీ కదరావన్ పలని ఐఏఎస్. గారు కలిసి, హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న ఈనెల 27వ తారీకున మహా ధర్నా కార్యక్రమానికి సంబంధించి సమాచార పత్రాన్ని అందచేశారు.
ఈ కార్యక్రమంలో టీజీవో అసోసియేట్ ప్రెసిడెంట్ ఆశన్న. ఎన్జీవో హైదరాబాద్ జిల్లా కార్యదర్శి K. శ్రీనివాస్. నాలుగో తరగతి అధ్యక్షుడు సత్యనారాయణ. మంజుల రెడ్డి. కో కన్వీనర్ నర్సింగ్ రావు. జాకబ్. డాక్టర్ సురేందర్. బాలాజీ. రాజ్ కుమార్.వెంకటేష్. తదితరులు పాల్గొని ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం మరియు వారి న్యాయమైన హక్కుల పరిరక్షణ కోసం మనమందరం ఐక్యంగా, సమష్టిగా పనిచేద్దాం అని పేర్కొన్నారు.
ఎస్ .విక్రమ్ కుమార్ మరియు ఎం.బి.కృష్ణ యాదవ్.TGEJAC Hyderabad District.
