గాంధీభవన్లో ఆషాడ మాస బోనాలు సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణక్క గారి ఆధ్వర్యంలో బోనాల సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడవాళ్లకు ఎంతో ఇష్టమైన పండుగ బోనాల పండగ మన తెలంగాణ సాంస్కృతికి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగను మహిళలు ఎంతో సుచి శుభ్రతతో నిష్టగా నిర్వహిస్తారని వారు అన్నారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కృషి రాష్ట్రం షష్యశ్యామలంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని వారు అన్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, ఆషాడ మాసం ఆరంభంతోనే అమ్మవారి పూజలు ప్రారంభమవుతాయని, బోనాలు పోతరాజులు శివసత్తుల ఆటలతో ఆషాడ మాసం అంతా అమ్మవారికి బోనాలను సమర్పించుకుంటారని వారు అన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదంతో దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా, సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు జిల్లా అధ్యక్షులు అందరూ భారీ ఎత్తున మహిళలు పాల్గొని బోనాల సంబరాలను విజయవంతం చేశారు.
గాంధీభవన్లో అంబరాన్నంటిన ఆషాడ మాస బోనాల సంబరాలు.
