Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

నేషనల్ లైబ్రేరియన్స్ డే సందర్భంగా ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీ లైబ్రేరియన్ డాక్టర్ విద్యా సాగర్ ను సన్మానించిన ఎంబి కృష్ణ యాదవ్

గ్రంథాలయ పితామహుడు ప్రొఫెసర్ యస్ ఆర్ రంగనాథన్ 134వ జన్మదిన సందర్భంగా హైదరాబాద్ జిల్లా బ్రాంచ్ అధ్యక్షుడు ఎంబి కృష్ణ యాదవ్ ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీ లైబ్రరీని సందర్శించి కాలేజ్ లైబ్రేరియన్ డాక్టర్ క్రొత్త విద్యా సాగర్ ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంథాలయం విద్యాలయానికి గుండెకాయ వంటిదని, మానవ మనుగడ, అభివృద్ధి, మానసిక అభివృద్ధి కేవలం నిరంతర పుస్తక పఠన, గ్రంథాలయంలో సమయాన్ని వెచ్చించడం ద్వారానే జరుగుతుందని వారు తెలిపారు. గ్రంథాలయ అభివృద్ధిని విస్మరిస్తే విద్యార్థుల విద్యాప్రగతికి ఆటంకం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇట్టి కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా టి జి వో అధికారులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు తిరుపతి, గోపి సురేందర్, భాను ప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *