Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

పూలే దంపతుల ఆశయాలు.. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు స్ఫూర్తి: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్

నేడుతెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున నెక్లెస్ రోడ్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే–సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పాల్గొని పూలే దంపతుల విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వేదికపై ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మాట్లాడుతూ..మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు సమాజంలో సమానత్వం, విద్య, మహిళా సాధికారత, సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను అంకితం చేశారు. వారి ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం.

పూలే దంపతుల ఆలోచనలు, ఆశయాలను ఆచరణలోకి తీసుకువస్తూ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నారు.

పూలే దంపతుల విగ్రహావిష్కరణ చారిత్రాత్మక ఘట్టమని, భవిష్యత్ తరాలకు వారి సేవలు, పోరాటం, ఆశయాలను గుర్తుచేసేలా ఈ విగ్రహాలు నిలుస్తాయని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *