కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమెన్ & చైల్డ్ వేల్ఫేర్ డిపార్ట్మెంట్ బాల రక్ష భవన్ లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు మహమ్మద్ సాదిక్ పాషా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిసిపివో హరి కుమారి, పివోఐసి వినోద్ యదవ్, ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ బానోత్ సందీప్, ఈసంపల్లి నాగరాజు, భారతి, కళ్యాణి, లత, లలితా, సారిక, బాలరాజు, త్రివేణి, రంజీత్, తదితరులు పాల్గొన్నారు.
బాల రక్ష భవన్ లో ఘనంగా స్వతంత్రం దినోత్సవం వేడుకలు.
