ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అత్యధికసార్లు వీక్షించిన ముగ్గురు రైతులను, కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ప్రతిభ కనబరిచిన నర్సిరెడ్డిని జిల్లా కలెక్టర్ అంకిత్ జ్ఞాపికలతో సత్కరించి అభినందించారు.
రైతులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
