Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

స్పెషల్ డ్రైవ్ రిక్రూట్‌మెంట్ జీవో పునరుద్ధరణపై ముఖ్యమంత్రికి అభినందనలు

ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్: స్పెషల్ డ్రైవ్ రిక్రూట్‌మెంట్ (Special Drive Recruitment) జీవోను పునరుద్ధరించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం ఆధ్వర్యంలో అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఫోరం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. జీవో కోసం కృషి చేసిన మంత్రి అట్లూరు లక్ష్మణ్ . మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిత రామచంద్రన్. ప్రస్తుత దివ్యాంగుల ప్రిన్సిపల్ సెక్రెటరీ శృతి ఓజ చెరుకు నాగభూషణం. పి వెంకటేశ్వర్లు కు కృతజ్ఞతలు అనంతరం దివ్యాంగ విద్యార్థులు, యువత మరియు ఫోరం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

దివ్యాంగుల కోసం ప్రత్యేక నియామక ప్రక్రియను పునరుద్ధరించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో పెండింగ్‌లో ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి మార్గం సుగమం అవుతుందని ఫోరం ప్రతినిధులు పేర్కొన్నారు. ఇది దివ్యాంగ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో కీలకమైన నిర్ణయమని అన్నారు.
విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం తరఫున ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా దివ్యాంగుల సంక్షేమం, విద్య, ఉపాధి మరియు హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం తెలంగాణ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్. అశోక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవేణి చంద్రశేఖర్ యాదవ్ ఉపాధ్యక్షులు డాక్టర్ కుర్షిత్ మియా మహిళా అధ్యక్షురాలు ధనమ్మ
కార్యవర్గ సభ్యులు, వెంకటేశ్వర్లు శివ యాదవ్, అరవిందు దివ్యాంగ విద్యార్థులు నిరుద్యోగ యువత మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *