Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

ఆంథే (ANTHE) 2026ను ప్రారంభించిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) : విద్యార్థులు తమ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి మరియు పోటీ పరీక్షలలో విజయం కోసం సిద్ధం కావడానికి సహాయపడే అతిపెద్ద ప్రతిభాన్వేషణ పరీక్ష.

భారతదేశంలోనే అత్యంత సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ ప్రతిభాన్వేషణ పరీక్ష, గత 16 సంవత్సరాలలో 1 కోటి మందికి పైగా విద్యార్థులను నమోదు చేసుకుంది. ఇది శాస్త్రీయ మూల్యాంకనం, జాతీయ బెంచ్ మార్కింగ్ మరియు వ్యక్తిగత విద్యా పరిజ్ఞానంను మిళితం చేసి, విద్యార్థులు ఏ అంశాలలో తమను తాము మెరుగుపరచుకోవాలో మరియు తదుపరి ఏమి చేయాలో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఆంథే (ANTHE) 2026 క్లుప్తంగా

గత 16 సంవత్సరాలలో 1 కోటి మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్న ఆంథే, భారతదేశంలోనే అతిపెద్ద, అత్యంత సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రతిభాన్వేషణ పరీక్ష.

పరీక్షలోని ప్రతి ప్రశ్న ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం రూపొందించబడింది. ఇది వివిధ సబ్జెక్టులలోని నిర్దిష్ట భావనలను, సామర్థ్యాలను అంచనా వేయడానికి ఉద్దేశించబడింది.

విద్యార్థి యొక్క విద్యా ప్రతిభ, పోటీకి సంసిద్ధత, పరీక్షా ప్రవర్తనను అర్ధం చేసుకోవడానికి, కేవలం మార్కులకు అతీతంగా చూసే ఒక సమగ్రమైన, శాస్త్రీయంగా రూపొందించిన నిర్ధారణ మూల్యాంకనం.

విద్యార్థుల ప్రతిభ, ప్రదర్శనలకు బహుమతులుగా 100% వరకు స్కాలర్షిప్లు మరియు రూ. 2.5 కోట్ల నగదు బహుమతులు అందించబడతాయి.

ఆగస్టు 26, 2026: పోటీతత్వంతో కూడిన విద్యా ప్రయాణానికి సిద్ధమవుతున్న విద్యార్థికి, ఏమి చదవాలో తెలుసుకోవడం అనేది ఆ ప్రక్రియలో ఒక భాగం మాత్రమే. తాము ఏ స్థాయిలో ఉన్నారో, ఏ విషయాలలో రాణిస్తున్నారో, ఎక్కడ మెరుగుపడాల్సిన అవసరం ఉందో అర్థం చేసుకోవడం కూడాఅంతే ముఖ్యం. సన్నద్ధతకు, స్వీయ అవగాహనకు మధ్య ఉన్న ఈ అంతరాన్ని పూరించడానికే గత 16 సంవత్సరాలుగా ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ (ANTHE) ప్రయత్నిస్తోంది.

ఆంథే ప్రారంభమైనప్పటి నుండి ఒక కోటి మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకోవడంతో, ఈ పరీక్ష భారతదేశంలోని అతిపెద్ద, అత్యంత సుదీర్ఘకాలంగా నడుస్తున్న విద్యార్థి మూల్యాంకన వేదికలలో ఒకటిగా ఎదిగింది. ప్రతిభను గుర్తించే కార్యక్రమంగా ప్రారంభమైన ఆంథే, ఇప్పుడు ఒక క్రమబద్దమైన విద్యా ప్రమాణంగా రూపాంతరం చెందింది. ఇది విద్యార్థులు తమ సన్నద్ధతను అంచనా వేసుకోవడానికి, వారి పోటీ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి, భవిష్యత్ ప్రయాణానికి బలమైన పునాది వేసుకోవడానికి సహాయపడుతుంది.

కేవలం తుది స్కోరు ద్వారా మాత్రమే విద్యార్థి ప్రతిభను కొలిచే మూల్యాంకనానికి భిన్నంగా, ఆంథే ఒక సమగ్రమైన, శాస్త్రీయంగా నిర్మాణాత్మకమైన నిర్ధారణాత్మక మూల్యాంకనంగా రూపొందించబడింది. ప్రతి ప్రశ్న ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం, నిర్దిష్ట భావనలు, సామర్థ్యాలకు గుర్తించేందుకు అనుగుణంగా రూపొందించబడింది. దీనివల్ల విద్యార్థులను విషయ పరిజ్ఞానం, అభిరుచి, విశ్లేషణాత్మక సామర్థ్యం, పరీక్షా ప్రవర్తన వంటి అంశాలలో మూల్యాంకనం చేయడానికి వీలవుతుంది. దీంతో విద్యార్థులు తమ ప్రతిభను ఒకే సంఖ్యకు పరిమితం చేయకుండా, తమ పనితీరు, బలాలు, మెరుగుపరుచుకోవాల్సిన అంశాలపై మరింత స్పష్టమైన అవగాహన పొందగలుగుతారు.

జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థుల ప్రయాణాలలో కూడా ఈ ముందస్తు అంచనా యొక్క ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తుంది. నీట్ యుజి 2026లో, మొదటి 100 ర్యాంకులు సాధించిన 41 మంది ఆకాష్ విద్యార్థులలో 31 మంది అంతకుముందు ఆంథే ద్వారా అర్హత సాధించినవారే. అలాగే, జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో మొదటి 100 లోపు ర్యాంక్ లను సాధించిన ఆకాష్ విద్యార్థులు 11 మందిలో 7 గురు ఆంథే విద్యార్థులే ఉన్నారు. ఈ ఫలితాలు విద్యార్థుల పోటీ పరీక్షల ప్రయాణంలో ప్రారంభ దశలోనే వారి సామర్థ్యాలను గుర్తించడం, క్రమబద్ధమైన విద్యా ప్రణాళికతో సిద్ధం చేయడం, నిరంతరం మార్గనిర్దేశం అందించడం ఎంత కీలక పాత్ర పోషిస్తాయో స్పష్టం చేస్తున్నాయి.

ఆంథే ప్రాముఖ్యత గురించి ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) ఎండి, సీఈఓ అయిన శ్రీ చంద్ర శేఖర్ గరిస రెడ్డి మాట్లాడుతూ “మా దృష్టిలో, ఆంథే అనేది కేవలం విద్యార్థికి లభించే స్కాలర్షిప్ను నిర్ణయించే పరీక్ష మాత్రమే కాదు. సరైన మార్గదర్శకత్వం, ఎంతో ప్రభావం చూపగల కీలకMedical IT-RE Foundation

దశలో, విద్యార్థులు తమ విద్యాపరమైన సామర్థ్యాన్ని తామే స్వయంగా అర్థం చేసుకోవడంలో సహాయపడటమే దీని ప్రధాన ఉద్దేశ్యం. గత 16 ఏళ్లుగా, కోటి మందికి పైగా విద్యార్థులు తమ సామర్ధ్యాన్ని అంచనా వేసుకోవడానికి, తమ ప్రస్తుత స్థాయిని తెలుసుకోవడానికి ఆంథే ని ఒక గొప్ప అవకాశంగా భావించి విశ్వసించారు. ఈ పరీక్ష యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం విద్యార్థి సాధించిన మార్కులను మాత్రమే కాకుండా వారి బలాలు, సన్నద్ధత మెరుగుపరచుకోవాల్సిన అంశాల గురించి లోతైన అవగాహనను కల్పిస్తుంది. ప్రతి విద్యార్థి ఆంథే ద్వారా తమ విద్యా ప్రయాణంపై మరింత స్పష్టతను, భవిష్యత్తు కోసం సరైన అవగాహనతో కూడిన మార్గాన్ని పొందాలని మేము కోరుకుంటున్నాము” అని అన్నారు.

ఈ పరీక్ష విలువ దాన్ని రాసి, పూర్తి చేయడంతో ముగిసిపోదు. పరీక్ష అనంతరం విద్యార్థులకు అందే ఫలితాలు, అవగాహన, మార్గనిర్దేశంలోనే దాని అసలు ప్రయోజనం కనిపిస్తుంది. ఆంథేలో పాల్గొనే ప్రతి విద్యార్థికి సమగ్రంగా రూపొందించిన ‘ఆంథే ఇంటెలిజెన్స్ రిపోర్ట్’ అందుతుంది. పరీక్షలో సాధించిన ఫలితాలను కేవలం స్కోర్గా చూపించకుండా, విద్యార్థి విద్యా సామర్థ్యంపై ఉపయోగకరమైన, ఆచరణాత్మకమైన అవగాహన కల్పించేలా ఈ నివేదికను రూపొందించారు. ఈ రిపోర్ట్, విద్యార్థులు తమ సబ్జెక్టుల వారీగా ఉన్న బలాబలాలను, ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అంశాలను గుర్తించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో, పోటీ పరీక్షల డిమాండ్లను ఎదుర్కోవడానికి తాము ఎంతవరకు  సిద్ధంగా ఉన్నామనే దానిపై వారికి ఒక అవగాహనను కూడా అందిస్తుంది. ఈ రిపోర్ట్ ఒ SA ద్యార్థి ప్రతిభకు సంబంధించిన మూడు విభిన్న అంశాలను మరింతగా పరిశీలిస్తుంది-కాంపిటీటివ్ ఎగ్జామ్ సక్సెస్ పొటెన్షియల్ (CESP), టెస్ట్- టేకింగ్ పర్సనాలిటీ (TTP) మరియు అటెంప్ట్ ఇంటెలిజెన్స్ కోషెంట్ (AIQ). వీటి ద్వారా విద్యార్థి పరీక్షను ఎలా ఎదుర్కొంటున్నాడనే దానిపై మరింత సమగ్ర అవగాహన లభిస్తుంది. ఉన్నత స్థాయి ఆలోచనా సామర్థ్యం, పోటీ పరీక్షల్లో సవాళ్లను ఎదుర్కొనే తీరు నుంచి… పరీక్ష సమయంలో అనుసరించే విధానం, ప్రశ్నలను ఎంచుకోవడంలో తీసుకునే నిర్ణయాలు, ఖచ్చితత్వం, రిస్క్ మధ్య పాటించే సమతుల్యత వరకు విద్యార్థి పరీక్షను ఎలా రాస్తున్నాడో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

దీనివల్ల, ఇప్పటికే జెఈఈ లేదా నీట్ కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులకే కాకుండా, తమ విద్యా ప్రయాణంలో ఇంకా ప్రారంభ దశలో ఉన్నవారికి కూడా ఆంథే ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. జాతీయ బెంచ్మర్కింగ్ను అందించడం ద్వారా విద్యార్థులు తమ రాష్ట్రం, దేశవ్యాప్తంగా ఉన్న తోటివారితో పోలిస్తే తాము ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోగలరు. ఈ మూల్యాంకనం, పోటీపరీక్షల దృక్కోణం నుండి తమ పనితీరును పరిశీలించుకోవడానికి, ముందుకు సాగుతున్న కొద్దీ తాము ఏ అంశాలలో బలోపేతం కావాలో గుర్తించడానికి వారికి వీలు కల్పిస్తుంది.

ఆంథే ప్రధానంగా ఒక విషయాన్ని విశ్వసిస్తుంది, మూల్యాంకనం అనేది ఫలితాన్ని చెప్పడంతో ముగియకూడదు.. ఆ ఫలితాన్ని ఆధారంగా చేసుకుని తదుపరి అడుగు వేయించేలా ఉండాలి. ఒక విద్యార్థి ఫలితం కేవలం వారు బాగా రాణించారా లేదా అని మాత్రమే చెప్పకూడదు; వారు దేనిలో రాణిస్తున్నారో, ఎక్కడ మెరుగుపడాల్సిన అవసరం ఉందో, తదుపరి దేనిపై దృష్టి పెట్టాలో అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో కూడా అది సహాయపడాలి. విద్యా సామర్థ్యాన్ని అంచనా వేయడంతో పాటు, పోటీ పరీక్షలకు విద్యార్థి సన్నద్ధత, పరీక్షను ఎదుర్కొనే తీరును కూడా పరిగణనలోకి తీసుకుంటూ ఆంథే రూపొందించబడింది. విద్యార్థి తన విద్యా ప్రయాణంలో అత్యంత కీలకమైన, సవాళ్లతో కూడిన దశకు చేరుకునేలోపే.. తన సామర్థ్యం, సన్నద్ధత, మెరుగుపరుచుకోవాల్సిన అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించడమే ఆంథే లక్ష్యం.

అర్హులైన విద్యార్థులు ఆకాష్ యొక్క క్లాస్లూమ్, హైబ్రిడ్, డిజిటల్ ప్రోగ్రామ్లను పొందేందుకు వీలు కల్పిస్తూ, స్కాలర్షిప్లు ఆంథే యొక్క ఒక ముఖ్యమైన ఫలితంగా నిలుస్తాయి. ఆంథే 2026 కోసం, విద్యార్థులు వర్తించే ప్రమాణాలకు లోబడి 100% వరకు స్కాలర్షిప్లను పొందవచ్చు, దీనితో పాటు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రూ.2.5 కోట్ల నగదు బహుమతులు కూడా లభిస్తాయి. ఈ పరీక్ష 5వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది. ఇది ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ పద్ధతులలో నిర్వహించబడుతుంది.

ఆంథే 2026 కొరకు రిజిస్ట్రేషన్లు ఇప్పుడు అధికారిక ఆంథే పోర్టల్ మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఆకాష్ కేంద్రాల ద్వారా ప్రారంభమయ్యాయి. ఆన్లైన్ పరీక్ష 2026 అక్టోబర్ 27 నుండి నవంబర్ 1 వరకు నిర్వహించబడుతుంది, కాగా ఆఫ్లైన్ పరీక్ష 2026 అక్టోబర్ 11, 25 మరియు నవంబర్ 1 తేదీలలో జరుగుతుంది.

ఆంథే గురించి

ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ (ఆంథే) భారతదేశంలోని అతిపెద్ద స్కాలర్షిప్ పరీక్షలలో ఒకటి. ఇది 7వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు క్లాస్లూమ్, హైబ్రిడ్ మరియు డిజిటల్ ప్రోగ్రామ్ల కోసం 100% వరకు స్కాలర్షిప్లను సంపాదించే అవకాశాన్నిఅందిస్తుంది. ఈ పరీక్ష కీలకమైన సబ్జెక్టులలో విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలను అంచనా వేస్తుంది. వారిని పోటీ పరీక్షలలో విజయం కోసం సిద్ధం చేస్తుంది.

ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL) గురించి

ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL) భారతదేశంలోని ప్రముఖ టెస్ట్ ప్రిపరేటరీ కంపెనీ. ఇది ఒలింపియాడ్స్ వంటి పోటీ పరీక్షలతో పాటు, అత్యంత ప్రాముఖ్యత కలిగిన మెడికల్ (నీట్) మరియు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు (జెఈఈ) సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం సమగ్ర ప్రిపరేషన్ సేవలను అందించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. AESL భారతదేశ వ్యాప్తంగా 415కు పైగా కేంద్రాల నెట్వర్క్ ను కలిగి ఉంది, ఇందులో ప్రస్తుతం 4 లక్షలకు పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. గత 37 సంవత్సరాలుగా ఇది బలమైన మార్కెట్ స్థానాన్ని మరియు బ్రాండ్ విలువను నిర్మించుకుంది. AESL అనేది మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ (MEMG) లో ఒక భాగం. MEMG అనేది విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు ఆరోగ్య బీమా రంగాలలో విస్తరించిన ఒక ప్రముఖ భారతీయ వ్యాపార సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *