ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు.
బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న భక్తులకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
