Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

జూబ్లీహిల్స్ నియోజకవర్గం A.G. కాలనీ డివిజన్ పరిధిలోని యాదగిరి నగర్, జై భవాని నగర్‌లో శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయానికి నూతనంగా నిర్మించిన ముఖద్వారం (కమాన్) ప్రారంభోత్సవం

జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ వి. నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్మించిన ఈ దేవాలయ ముఖద్వారం (కమాన్‌)ను హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడంతో పాటు, దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *